రైతుల రిలే నిరాహార దీక్ష విరమణ | - | Sakshi
Sakshi News home page

రైతుల రిలే నిరాహార దీక్ష విరమణ

Mar 22 2025 1:46 AM | Updated on Mar 22 2025 1:43 AM

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఎల్‌ఎం–6 కాల్వ పనులు పూర్తి చేయాలని కోరుతూ 19 రోజులుగా పెద్దలింగాపూర్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం విరమించారు. స్థానిక తహసీల్దార్‌ ఫారుక్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా అధికారుల ఆదేశాలతో దీక్షా శిబిరానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. కాల్వపనులకు, భూకేటాయింపులకు నిధులు మంజూరయ్యాయని మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని తెలపడంతో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు డీఈ సీతారాం, ఆర్‌ఐ షఫీ, రైతులు అశోక్‌, నర్సయ్య, గాదె మధుసూదన్‌, కరికె నవీన్‌, లక్ష్మి, అనిత, రేణ పాల్గొన్నారు.

అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్లకల్చరల్‌: చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ అదనపు సంచాలకుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 30ఏళ్లలోపు వయసు, చేనేతరంగంలో పదేళ్ల అనుభవం ఉన్న వారుఅర్హులు అని పేర్కొన్నారు. డిజైనర్లు పాతికేళ్లలోపు వయసుతోపాటు డిజైన్‌ల రంగంలో కనీసం ఐదేళ్లకు తగ్గకుండా అనుభవం గల వారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న చేనేత కళాకారులు, డిజైనర్లు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, తగిన శాంపిళ్లతో ఏప్రిల్‌ 15లోపు జౌళి శాఖ ఆఫీస్‌లో అందజేయాలని తెలిపారు.

వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి రాఽధికా జైశ్వాల్‌

సిరిసిల్లటౌన్‌: పౌరులు వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రాధికా జైశ్వాల్‌ పేర్కొన్నారు. స్థానిక విద్యానగర్‌ వెల్ఫేర్‌ సొసైటీ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా ఫోరంలో రూ.కోటి వరకు, రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో రూ.కోటి నుంచి రూ.10కోట్ల వరకు, జాతీయ వినియోగదారుల కమిషన్‌లో రూ.10కోట్లు ఆపైన ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని వివరించారు. వస్తువు కొనుగోలు చేసిన సమయంలో తీసుకున్న బిల్లు ఉండాలన్నారు. లోక్‌ అదాలత్‌ మెంబర్లు చింతోజు భాస్కర్‌, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ ఎస్‌.మల్లేశ్‌యాదవ్‌, సొసైటీ అధ్యక్షుడు పబ్బతి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

మగ్గంవర్క్‌తో మహిళలు ఆర్థికంగా ఎదగాలి

నాబార్డ్‌ ఏజీఎం శ్రీకాంత్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మగ్గం వర్క్‌ శిక్షణను పూర్తి చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్డ్‌ ఏజీఎం శ్రీకాంత్‌ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని ఐకేపీ ఆఫీస్‌లో నాబార్డ్‌, స్పందన సేవా సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మగ్గం వర్క్‌ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. మహిళలు చేస్తున్న మగ్గంవర్క్‌ను పరిశీలించి అభినందించారు. డీడీఎంలు జయప్రకాశ్‌, దిలీప్‌చంద్ర, ఏపీఎం మల్లేశం, స్పందన సొసైటీ సీఈవో శోభారెడ్డి, సీసీలు, శ్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.

వయోవృద్ధులపై నిర్లక్ష్యం తగదు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): వయోవృద్ధులపై సంతానం నిర్లక్ష్యం చేయొద్దని, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే పిల్లలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధి కారి లక్ష్మీరాజం హెచ్చరించారు. మండలంలోని గాలిపల్లిలో శుక్రవారం వయోవృద్ధుల సమావేశంలో మాట్లాడారు. వయోవృద్ధులను సంతానం నిర్లక్ష్యం చేస్తే జిల్లా అధికారులు, ట్రిబ్యునల్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మహిళా సాధికారత కోఆర్డినేటర్‌ రోజా, జెండర్‌ స్పెషలిస్ట్‌ దేవిక, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సూర్యకళ పాల్గొన్నారు.

రైతుల రిలే నిరాహార దీక్ష   విరమణ
1
1/1

రైతుల రిలే నిరాహార దీక్ష విరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement