
పట్టుదలగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు
● ట్రాఫిక్ ఎస్సై రమేశ్
సిరిసిల్ల: పట్టుదలగా చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా సాధించవచ్చని, సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సిరిసిల్ల పట్టణ ట్రాఫిక్ ఎస్సై అల్లం రమేశ్ పేర్కొన్నారు. జిల్లా బీసీ స్టడీసర్కిల్ ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రంలో శుక్రవారం మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, ఎస్ ఎస్‌సీ కోచింగ్ అభ్యర్థులతో మాట్లాడారు. పోటీప్రపంచంలో చదువుతోనే ఉన్నత స్థితికి చేరుతారన్నా రు. బీసీ స్టడీసర్కిల్‌ను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, కోర్స్ కోఆర్డినేటర్ హరీష్, ఫ్యాకల్టీ నాగరాజు, సిబ్బంది సురేష్, దివ్య, ప్రసాద్, మురళి, వనిత పాల్గొన్నారు.