
న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జూపెల్లి శ్రీనివాసరావు, తంగళ్లపెల్లి వెంకటి ఎన్నికయ్యారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల నిర్వహణాధికారి సురభి సత్యనారాయణరావు ప్రకటించారు. అధ్యక్ష స్థానానికి పోటీపడ్డ రమణారెడ్డికి 56 ఓట్లు, ఆవునూరి రమాకాంత్‌రావుకు 41 ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీ జరుగగా.. చివరికి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి రమణారెడ్డిపై 23 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శి స్థానానికి పోటీచేసిన జవ్వాజి ప్రసాద్‌కు 60 ఓట్లు రాగా 54 ఓట్ల మెజారిటీతో తంగళ్లపెల్లి వెంకటి గెలుపొందారు. వెంకటి వరుసగా రెండో సారి కార్యదర్శిగా గెలుపొందడం. ఉపాధ్యక్షుడిగా ఎస్.అనిల్‌కుమార్ ఏకగ్రీవమయ్యారు. సంయుక్త కార్యదర్శిగా గాజుల రాజమల్లు, కోశాధికారిగా వేముల నరేశ్, మహిళా ప్రతినిధిగా మంద పుష్పలత ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికై న ప్రతినిధులకు సహచర న్యాయవాదులు అభినందనలు తెలిపారు.