రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
● సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): రాజ్యాంగాన్ని రక్షించుకుందామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లో రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిందన్నారు. జిల్లా కోఆర్డినేటర్ జావిద్ మాట్లాడుతూ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతీ గ్రామంలో ప్రచారం చేయాలని కోరారు. ప్రోగ్రాం ఇన్‌చార్జి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, డీసీసీ కో ఆర్డినేటర్ లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హరిలాల్‌నాయక్, కరీంనగర్ గిరిజన విభాగం కోఆర్డినేటర్ గజాన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.


