● సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ ● నేతన్నలకు సామూహిక కౌన్సెలింగ్
సిరిసిల్ల: నేతకార్మికులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి ఆహారం తీసుకుంటూ.. ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సూచించారు. స్థానిక కార్మికవాడలో జిల్లా జనరల్ ఆస్పత్రి మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్విని యోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. పవర్‌లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు మహిళాశక్తి చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చిందని వివరించారు. నేతన్నలు మానసిక, శారీరక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. తంబాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. మరమగ్గాల పారిశ్రామికులు దూస ప్రసాద్, మైండ్ కేర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపెళ్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి పాల్గొన్నారు.