నాలుగు ఇళ్లలో చోరీ
మానకొండూర్: అన్నారం గ్రామంలో మంగళవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి, ఓ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మానకొండూర్ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గొట్టెముక్కుల విజయ ఇంట్లో నిద్రిస్తుండగా.. బంగారు పుస్తెల తాడు అపహరించారు. మధునాల వెంకటమ్మ ఇంట్లో 55 తులాల వెండి, రూ.20వేల నగదు, రుద్రోజు వెంకటాచారి ముప్పావు తులం బంగారం, 18 తులాల వెండి పట్టీలు, పాకాల రాజిరెడ్డి ఇంటి ఎదుట ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ, క్లూస్ టీం పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మిర్చి యార్డులో..
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని మిర్చియార్డ్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేలు దొంగిలించారని యజమాని శ్రీనివాస్, అంజయ్య తెలిపారు. ఇద్దరు దొంగలు రాత్రివేళ చోరీకిపాల్పడినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. యజమాని శ్రీనివాస్, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్‌ఎండీ ఎస్‌ఐ వివేక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్లూస్‌టీంకు సమాచారం అందించగా సీఐతో సిబ్బంది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఆధారాలను సేకరించి విచారణ చేపడతామని తెలిపారు.
నాలుగు ఇళ్లలో చోరీ


