● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్–2025లో వెల్లడి
గనుల ద్వారా ఆదాయం
ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.
సాక్షి, పెద్దపల్లి:
జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్‌లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి.
జిల్లా టార్గెట్ వసూలైంది
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
పెద్దపల్లి 2,465.99 2,264.30
సిరిసిల్ల 1,465.07 1,342.18
కరీంనగర్ 12,872.16 10,658.72
జగిత్యాల 2,259.05 1,356.26
ఆదాయం అంతంతే..