
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్
కోనరావుపేట(వేములవాడ): పేద, మద్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. బుధవారం మండలకేంద్రంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఇచ్చిన బియ్యాన్ని కొందరు వినియోగదారులు దళారులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యాన్ని అమ్ముకోకుండా సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో వసంతలక్ష్మి, తహసీల్దార్ వరలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు నాయిని ప్రభాకర్‌రెడ్డి, లింభయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, నాయకులు బొర్ర రవీందర్, గోపాల్, గొట్టె రుక్మిణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలి
వివిధద అసవసరాల నిమిత్తం సర్టిఫికెట్లు కోసం వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు జాప్యం చేయకుండా త్వరగా జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. కోనరావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అనేక మంది నిరుద్యోగ యువతీయువకులు దరఖాస్తు చేసుకుంటున్నారని, ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆదాయం, కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి, వారితో పాటు ఉన్నత విద్య కోసం విద్యార్థులు కూడా వస్తారని, జాప్యం చేయకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ వరలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐ రాజశేఖర్ ఉన్నారు.