
నేతన్నల డిమాండ్ల సాధనకు పోరాటం
● పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రమేశ్
సిరిసిల్లటౌన్: పనికి తగిన కూలీ లేకుండా శ్రమదోపిడీకి గురవుతున్న నేతకార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ పేర్కొన్నారు. కార్మికుల కూలీ పెంపునకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరింది. కార్మికులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయగా ఠాణాలో నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వద్ద చీరల ఉత్పత్తికి ఆర్డర్ తెచ్చుకున్న యాజమాన్యాలకు రేటు నిర్ణయించిన ప్రభుత్వం కార్మికుల కూలి నిర్ణయించలేదన్నారు. బతుకమ్మ చీరల కూలి కంటే తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్‌దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్, నక్క దేవదాసు, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, ఎక్కల్‌దేవి జగదీశ్, ఉడుత రవి తదితరులున్నారు.