అసెంబ్లీ నిర్ణయం చారిత్రాత్మకం
కోనరావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం గోర్‌బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం హర్షణీయమని బానోత్ నరేశ్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలో లంబాడీ బంజారాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో 15 కోట్లు, రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా ఉన్నారన్నారు. భాషను షెడ్యూల్‌లో చేర్చడం వల్ల గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల రక్షణతోపాటు వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. గిరిజన గోర్‌బోలి భాషను షెడ్యూల్‌లో చేర్చకుండా విస్మరించా రని, ఇప్పటికైనా కేంద్రమంత్రులు బండి సంజ య్, కిషన్‌రెడ్డి పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాల్యా నాయక్, నాయకులు రాజు నాయక్, కిషన్ నాయక్, పంతుల్ నాయక్ , ప్రకాశ్ నాయక్, రాజు బల్కర్, తిరుపతి, రమేశ్, మదన్ నాయక్, మోహ న్, అమృతలాల్, పరింగినాయక్ పాల్గొన్నారు.
పాదయాత్రల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి
బోయినపల్లి: ఏఐసీసీ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 2వ తేదీ నుంచి జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కార్యక్రమ మండల కో ఆర్డినేటర్ బొడ్డు రాములు కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జంగం అంజయ్య, సంబ లక్ష్మీరాజం, ఏనుగుల కనుకయ్య, అనీల్‌కుమార్, బొలుమాల శంకర్ ఉన్నారు.
సతాయిస్తున్న సర్వర్
● పది రోజులుగా సర్టిఫికెట్ల కోసం తండ్లాట
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో పలు రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. సర్వర్ ఎర్రర్‌తో సర్టిఫికెట్ల మంజూరులో జాప్యమవుతోంది. ఈనెల 17 నుంచి సర్వర్‌డౌన్ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ భరించలేక దరఖాస్తులు రిజిస్టర్‌లో ఎంట్రీ చేసే గదికి రెవెన్యూ సిబ్బంది తాళం వేశారు. సుమారు వేయికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. తహసీల్దార్ నారాయణరెడ్డిని వివరణ కోరగా.. సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని, ఒకేసారి వందల కొలది దరఖాస్తులు రావడంతో కొంత జాప్యమవుతోందని తెలిపారు.
అసెంబ్లీ నిర్ణయం చారిత్రాత్మకం
అసెంబ్లీ నిర్ణయం చారిత్రాత్మకం


