
రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్ అధికారుల సోదాలు
మంథని: సూరయ్యపల్లి రైస్‌మిల్లులో పౌర సరఫరా ల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. 2022–23 సీఎమ్మార్ ప్రకారం ధాన్యం నిల్వలపై అనుమానాల్లో భాగంగా సూరయ్యపల్లి రైస్‌మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు. మిల్లులో 41,365 క్వింటా ళ్లు ఉండాల్సి స్థానంలో ధాన్యం లేదని గుర్తించారు. కాగా, తాను లీజు తీసుకున్న గంగాపురి సమీపంలో ధాన్యం నిల్వ ఉందని యజమాని చెప్పడంతో అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ 9,689.08 క్వింటాళ్ల ధాన్యం నిల్వ మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని తేల్చారు. నిర్దేశించిన ప్రకారం ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, కానీ, అలా చేయక పోవడంతో సోదాల్లో వెలుగుచూసిన అంశాలను కమిషనర్‌కు నివేదిస్తామని స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. రూ.కోట్ల విలువైన ధాన్యం అందుబాటులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్ఫష్టత ఇవ్వాల్సి ఉంది. తనిఖీల్లో ఓఎస్డీ ప్రభాకర్, ఎస్‌ఐ జంగయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.