
హాస్టల్‌లోకి తీసుకెళ్తూ దొరికిపోయిన విద్యార్థి
సోనిపట్: గర్ల్ ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో దాచి తనుండే బాయ్స్ హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. భారీ సూట్‌కేస్‌తో హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సూట్‌కేస్ తెరిచేందుకు తీసేందుకు యత్నించారు. విద్యార్థులు చుట్టూ గుమికూడారు. సూట్‌కేస్ తెరిచి చూడగా ఓ యువతి బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఓ విద్యార్థి ఇదంతా వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరలయ్యింది. వర్సిటీ పీఆర్‌వో మాత్రం, ‘మా విద్యార్థులు అల్లరి చేశారంతే, ఇదేమంత పెద్ద విషయం కాదు’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం విశేషం.