గుడ్‌ బ్యాడ్‌ సెట్‌లో... | Exclusive Shooting For Ajith Good Bad Ugly Begins In Hyderabad | Sakshi
Sakshi News home page

గుడ్‌ బ్యాడ్‌ సెట్‌లో...

Published Sat, May 11 2024 3:01 AM | Last Updated on Sat, May 11 2024 11:41 AM

Exclusive Shooting For Ajith Good Bad Ugly Begins In Hyderabad

అజిత్‌ కుమార్‌ హీరోగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అజిత్‌ కుమార్‌తో తమ కొత్తప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలోప్రారంభమైంది.

ఈ కీలక షెడ్యూల్‌ కోసం ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అజిత్‌తో పాటు కీలక పాత్రధారులు ఈ షూట్‌లో పాల్గొంటున్నారు. ‘‘ఇండియన్‌ సినిమా బిగ్గెస్ట్‌ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అభినందన్‌ రామానుజం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement