
సౌత్ సినిమా తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలో నార్త్‌లో హవా చూపించగా, సాహోతో మరోసారి సౌత్ సినిమా బలం చూపించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. శనివారం హ్యాష్‌ట్యాగ్ డే సందర్భంగా ట్విటర్ ఇండియా గత ఆరు నెలల కాలంలో ట్రెండ్ అయిన టాప్ ఐదు హ్యాష్‌ట్యాగ్‌లను ప్రకటించింది.
ఈ లిస్ట్‌లో అజిత్ విశ్వాసం (#Viswasam) మొదటి స్థానంలో నిలిచింది. మరోసౌత్ సినిమా మహర్షి (#Maharshi) నాలుగో స్థానం సాధించటం విశేషం. రెండు మూడు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019(#LokSabhaElections2019), క్రికెట్ వరల్డ్ కప్ 2019(#CWC19) ట్యాగ్‌లు నిలిచాయి. ఐదో స్థానంలో #NewProfilePic అనే హ్యాష్‌ట్యాగ్ నిలిచింది. ఈ ఐదు స్థానాల్లో రెండు సౌత్ సినిమాలకు స్థానం దక్కగా ఒక్క బాలీవుడ్ సినిమా కూడా కనిపించకపోవటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment