జపాన్‌లోనూ విశ్వాసం | ajith viswasam releasing in japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లోనూ విశ్వాసం

Published Sat, Jan 5 2019 5:36 AM | Last Updated on Sat, Jan 5 2019 5:36 AM

ajith viswasam releasing in japan - Sakshi

తమిళ స్టార్‌ హీరోల్లో అజిత్‌ కూడా ఒకరు. రజనీకాంత్‌లా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు అజిత్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’. అజిత్‌ కెరీర్‌లో 58వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని   శివ దర్శకత్వంలో సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. నయనతార కథానాయిక. జగపతిబాబు స్టైలిష్‌ విలన్‌ పాత్రలో నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అంతేకాదు.. ఈ చిత్రాన్ని జపాన్‌లో కూడా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జపాన్‌కు చెందిన స్పేస్‌పార్క్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చే స్తోంది. కాగా, రజనీకాంత్‌ ‘పేట’ సినిమా కూడా చైనా, జపాన్‌ వంటి దేశాల్లోనూ ఈ సంక్రాంతికి విడుదలవుతుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement