
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్‌కు మోహన్ బాబు పరామర్శ

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ ని పరామర్శించిన నటుడు మోహన్ బాబు

కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పిన మోహన్ బాబు

తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య పిల్లలను క్షమాపణలు కోరిన మోహన్ బాబు

గాయం బాధ ఏంటో నాకు తెలుసు.. నువు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదు అన్న మోహన్ బాబు

నా వాళ్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నని అని చెప్పిన మోహన్ బాబు, విష్ణు

గాయం నుండి తొందరగా బయటపడాలని షిరిడీ సాయి నాథుని వేడుకుంటున్నాన్న మోహన్ బాబు

క్షమాపణలు నాకు కాదు జర్నలిస్టు సమాజానికి చెప్పాలన్న రంజిత్

మీ దాడి లో గాయపడ్డ నాకు మా సంస్థ తో పాటు జర్నలిస్టు సమాజం అండగా నిలిచింది అని మోహన్ బాబుకు చెప్పిన రంజిత్

జర్నలిస్టు సోదరులు అందరికీ క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
