నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు | Manchu Vishnu About Prabhas Kannappa Teaser Event Mumbai | Sakshi
Sakshi News home page

Prabhas: మోహన్ బాబు ఫోన్ కాల్.. భయపడ్డ ప్రభాస్

Published Fri, Feb 28 2025 7:03 AM | Last Updated on Fri, Feb 28 2025 7:14 AM

Manchu Vishnu About Prabhas Kannappa Teaser Event Mumbai

తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరు. ఎందుకంటే చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండింటి షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్నా సరే మంచు విష్ణు 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేశాడు. తాజాగా ప్రభాస్.. ఈ మూవీలో నటించడం గురించి హీరో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

'కన్నప్ప' సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు బయటపెట్టాడు. తొలుత నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని, అదే విషయాన్ని తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైనా పనుంటే నువ్వే (విష్ణు) కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్‌ కుమార్‌)

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. అలా ఇండియన్ మూవీ స్టార్స్ కూడా ఇందులో కీలకపాత్రల్లో నటించారు. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడిన విషయాన్ని మంచు విష్ణు బయటపెట్టాడు.

రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన కన్నప్ప.. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా.. అది అలరిస్తోంది. చిత్ర విడుదలకు ఇంకా టైముంది కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ మరింత రిలీజ్ చేస్తారేమో!

(ఇదీ చదవండి: సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్‌'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement