మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత | Tension At Mohan Babu Farm House, Fight Started Between Manchu Brothers Bouncers | Sakshi
Sakshi News home page

Manchu Family Row: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత

Published Tue, Dec 10 2024 1:10 PM | Last Updated on Tue, Dec 10 2024 1:31 PM

Tension At Mohan Babu Farm House

మోహన్‌ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మంచు మనోజ్‌ బౌన్సర్ల మధ్య గొడవ మొదలైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మంచు మనోజ్‌ బౌన్సర్లను విష్ణు ఆదేశించాడు. అయినా కూడా వాళ్లు అక్కడే ఉండడంతో.. తన బౌన్సర్లలో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి బౌన్సర్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా మంచు విష్ణునే రంగంలోకి దిగి మనోజ్‌ బౌన్సర్లను బయటకు తోసేశాడు. ప్రస్తుతం మనోజ్‌ బౌన్సర్లు మోహన్‌ బాబు ఫాంహౌస్‌ బయట ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,  గొడవ విషయం తెలియగానే పహడి షరీఫ్ పోలీసులు హుటాహుటిన మోహన్‌ బాబు ఫాం హౌస్‌కి వెళ్లి.. పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

(చదవండి: ఆస్తుల కోసం కాదు.. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్‌)

మంచు ఫ్యామిలీలో జరుగున్నతున్న వివాదం ఆదివారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ.. తనకు, తన భార్యకు ప్రాణహానీ ఉందని మంచు మనోజ్‌..  చిన్న కొడుకు మనోజ్‌తో తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

ఇక నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు.. నేడు తిరిగి హైదరాబాద్‌కు రావడంతో ఈ గొడవ మరింత ముదిరింది.  పెద్ద కొడుకు విష్ణుతో కలిసి మోహన్‌ బాబు నేరుగా తన ఫాంహౌస్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మనోజ్‌, విష్ణుల బౌన్సర్లు ఉన్నారు. విష్ణు రావడంతోనే మనోజ్‌ భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాను ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడంలేదని..ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మనోజ్‌ మీడియాతో తెలిపారు.  న్యాయం కోసం ఎంతమందినైనా కలుస్తానని చెప్పారు. 

మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
(చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్‌ బాబు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement