
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి కొత్త టీజర్ రిలీజైంది. ఎనిమిది నెలల క్రితం రిలీజైన టీజర్ తో పోలిస్తే ఈసారి ట్రోల్ చేసేంతలా ఏం లేదు. సినిమాలోని కీలక పాత్రధారుల్ని చూపిస్తూ కన్నప్ప ప్రపంచం ఎలా ఉందనేది చూచాయిగా చూపించారు.
(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')
1:24 నిమిషాల టీజర్ లో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్.. ఇలా అందరిని చూపించేశారు. నాస్తికుడు అయిన తిన్నడు.. అలియాస్ మన హీరో శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే స్టోరీ అని తెలుస్తోంది.
ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఉంటుందని మంచు విష్ణు చెప్పారు. టీజర్ అంతా ఏమో గానీ చివర్లో ప్రభాస్ ని కాసేపు అలా చూపించి అతడి అభిమానులని అయితే ఆకట్టుకున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment