
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలుత టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ కొన్నాళ్ల క్రితం శివయ్య అంటూ సాగే పాట రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చేసింది. ఇప్పుడు మూవీ నుంచి మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
ఈ సినిమాలో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. వినడానికి, చూడటానికి ఇది బాగానే ఉండటం విశేషం.
ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న 'కన్నప్ప'లో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు తదితరులు నటించారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?)
Comments
Please login to add a commentAdd a comment