
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది.
ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.
(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)
కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?
కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment