టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న మాతృశ్య ఫౌండేషన్‌కు చెందిన 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితమే వారిని దత్తత తీసుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.
మంచు విష్ణు తన ట్వీట్‌లో రాస్తూ..' ఏడాదిన్నర క్రితం తిరుపతిలోని(Tirupati) శ్రీమతి శ్రీదేవి గారు నిర్వహిస్తున్న మాతృశ్య ఫౌండేషన్‌కు వచ్చా. ఇక్కడ ఉన్న 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నా. వారి విద్యతో పాటు కొత్త బట్టలు అందిస్తున్నా. మనలాగే వారికి కూడా పండుగలు ఆనందకరమైన క్షణాలుగా ఉండేలా చూసుకుంటున్నా. ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రపంచానికి కూడా ఇలాంటి స్టోరీస్ తెలియజేయాలని భావిస్తున్నా. ఇది నేను చేసిన గొప్ప పనేం కాదు.. సమాజానికి ఓ చిన్నసేవ మాత్రమే. ఇది మీకు స్ఫూర్తినిస్తే.. మీ శక్తితో అవసరంలో ఉన్న ఎవరికైనా మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా' అని పోస్ట్ చేశారు.
సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ రోజు పిల్లలను అల్పాహారానికి ఆహ్వానించినట్లు మంచువిష్ణు తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తిని నింపుతూ వారితో ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించారు. పిల్లల చిరునవ్వు ఆశీర్వాదం..ఈ చిన్నపిల్లలే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదిగి.. అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారనే నమ్మకముందని మంచు విష్ణు పోస్ట్ చేశారు.
కన్నప్పలో మంచు విష్ణు..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలో కిరాట పాత్రలో మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్నారు.
కన్నప్ప కథేంటంటే..
కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నదిఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నామని మోహన్‌బాబు వెల్లడించారు.
టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కన్నప్ప టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
A year and a half ago, I adopted 120 children from Matrusya Foundation, Tirupati, run by Ms. Sridevi garu. I take care of their education, provide them with new clothes, and ensure festivals are moments of joy for them.
I wasn’t keen to share this with the world, but I feel the… pic.twitter.com/A80PwnRhR9— Vishnu Manchu (@iVishnuManchu) January 14, 2025
Comments
Please login to add a commentAdd a comment