కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... | Krishnamma made them together | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

Published Tue, May 13 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

‘ప్రేమ కథా చిత్రమ్’తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న సుధీర్‌బాబు-నందిత మళ్లీ మరో సినిమా చేస్తున్నారు. కన్నడంలో ఘనవిజయం సాధించిన ‘చార్మినార్’కి ఇది రీమేక్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, శిరీష ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కన్నడ వెర్షన్‌కి దర్శకుడైన ఆర్. చంద్రు తెలుగు వెర్షన్‌నీ డెరైక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘ఇదేనా ప్రేమ’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలుకానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement