
మహేశ్‌కు ‘పోకిరి’లా?
‘‘మహేశ్‌కు ‘పోకిరి’ ఎలాగో, నా కెరీర్‌లో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అలా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని మహేశ్ వీక్షించి చాలా ఎంజాయ్ చేశారు’’ అని సుధీర్‌బాబు చెప్పారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో లగ డపాటి శిరీష, శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘లక్ష్యం ముఖ్యమా, లవ్ ముఖ్యమా అనుకునే యూత్‌కు ఇదొక గైడ్. ‘ఐ లవ్ యూ’ అనే పదం చాలా పవిత్రమైనది. దాని విలువేంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఏ తరం వారికైనా నచ్చే లవ్‌స్టోరీ ఇది. ఈ సినిమాకు మంచి విజయం అందించిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డెరైక్టర్ హరిగౌర, మాటల రచయిత ఖదీర్‌బాబు, నటుడు లోహిత్ పాల్గొన్నారు.