చిన్న చిత్రాలు కూడా విజయం సాధించాలి - దాసరి | Short films also achieved success - Rao | Sakshi
Sakshi News home page

చిన్న చిత్రాలు కూడా విజయం సాధించాలి - దాసరి

Published Tue, Aug 18 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

చిన్న చిత్రాలు కూడా విజయం సాధించాలి - దాసరి

చిన్న చిత్రాలు కూడా విజయం సాధించాలి - దాసరి

‘‘పెద్ద చిత్రాలకు దీటుగా చిన్న చిత్రాలు కూడా విజయాలు సాధించాలి. శివ, మేఘశ్రీ చక్కగా నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. ‘పద్మాలయ’ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ, మేఘశ్రీ జంటగా జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో కొడాలి సుబ్బారావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’.
 
 వినోద్ యాజమాన్య సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను దాసరి నారాయణరావు హైదరాబాద్‌లో ఆవిష్కరించి, తొలి సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు అందించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ- ‘‘కొత్త తరహా కథాంశాలతో సినిమాలు రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
 
 ఈ సినిమా విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలతో  పాటు కావాల్సినంత కామెడీ ఈ  సినిమాలో ఉంటుంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో సుధీర్ బాబు, ప్రిన్స్, కునాల్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement