J. Prabhakar Reddy
-
చిత్రమ్ చెప్పిన కథ
సమాజాన్ని ఎప్పటినుంచో వెంటాడుతున్న ఓ సమస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా కొడాలి సుబ్బారావుతో కలిసి జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు నెలలో విడుదల కానుంది. నిర్మాత కొడాలి సుబ్బారావు మాట్లాడుతూ -‘‘సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల విడుదలను అక్టోబరుకు వాయిదా వేశాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడైన జె.ప్రభాకర్‌రెడ్డి రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. -
చిన్న చిత్రాలు కూడా విజయం సాధించాలి - దాసరి
‘‘పెద్ద చిత్రాలకు దీటుగా చిన్న చిత్రాలు కూడా విజయాలు సాధించాలి. శివ, మేఘశ్రీ చక్కగా నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. ‘పద్మాలయ’ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ, మేఘశ్రీ జంటగా జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో కొడాలి సుబ్బారావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. వినోద్ యాజమాన్య సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను దాసరి నారాయణరావు హైదరాబాద్‌లో ఆవిష్కరించి, తొలి సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు అందించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ- ‘‘కొత్త తరహా కథాంశాలతో సినిమాలు రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలతో పాటు కావాల్సినంత కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో సుధీర్ బాబు, ప్రిన్స్, కునాల్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. -
రెబల్‌గా మారే కుర్రాడు
ఈ కుర్రాడు చాలా ఇన్నోసెంట్. అనుకోని పరిస్థితుల్లో రెబల్‌గా మారతాడు. మరి ఆ తర్వాత ఏమైందనేది తెలియాలంటే ‘అనగనగా ఒక చిత్రమ్’ చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత జె. ప్రభాకర్ రెడ్డి. శివ, మేఘశ్రీ ఇందులో హీరో హీరోయిన్లు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా 85 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘చిన్న సినిమాగా మొదలు పెట్టాం. కానీ పెద్ద సినిమా అయింది. మే 4న టీజర్ విడుదల చేస్తాం. అదే నెల 31న పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ తారలతో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని హీరో శివ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొడాలి శ్రీనివాసరావు.