రెబల్‌గా మారే కుర్రాడు | Anaganaga Oka Chitram press meet | Sakshi
Sakshi News home page

రెబల్‌గా మారే కుర్రాడు

Published Tue, Apr 14 2015 10:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

రెబల్‌గా మారే కుర్రాడు

రెబల్‌గా మారే కుర్రాడు

ఈ కుర్రాడు చాలా ఇన్నోసెంట్. అనుకోని పరిస్థితుల్లో రెబల్‌గా మారతాడు. మరి ఆ తర్వాత ఏమైందనేది తెలియాలంటే ‘అనగనగా ఒక చిత్రమ్’ చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత జె. ప్రభాకర్ రెడ్డి. శివ, మేఘశ్రీ ఇందులో హీరో హీరోయిన్లు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 85 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘చిన్న సినిమాగా మొదలు పెట్టాం. కానీ పెద్ద సినిమా అయింది. మే 4న టీజర్ విడుదల చేస్తాం. అదే నెల 31న పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ తారలతో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని హీరో శివ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొడాలి శ్రీనివాసరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement