మంచి ప్రయత్నం | Anaganaga Oka Chitram Movie Teaser Launched | Sakshi
Sakshi News home page

మంచి ప్రయత్నం

Published Wed, May 6 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

మంచి ప్రయత్నం

మంచి ప్రయత్నం

‘‘ఈ సినిమా టీజర్‌ను చూస్తుంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని  దాసరి నారాయణరావు అన్నారు. శివ, మేఘశ్రీ జంటగా  కొడాలి సుబ్బారావు, జె.ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దాసరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తక్కువ రోజుల్లో, లోబడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడం మంచి ప్రయత్నం. మా తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శివ, మేఘశ్రీ, జె. ప్రభాకర్‌రెడ్డి, శాఖమూరి మల్లికార్జున రావు, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement