తెలుగులో ఇంకొకటి!
జాకీచాన్ హీరోగా నటించిన ఇండో–చైనీస్ సిన్మా ‘కుంగ్ ఫు యోగా’తో హిందీ హీరోయిన్ అమైరా దస్తూర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. పాపులారిటీ పెరిగిన తర్వాత కొందరు రీజనల్ సినిమాలను చిన్న చూపు చూస్తారు. అమైరా అలా కాదు. ఓ పక్క హిందీలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూనే, మరో పక్క తెలుగు సినిమాలకు సంతకం చేస్తున్నారు.
మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న అమైరా, సుధీర్‌బాబు హీరోగా చేయనున్న కొత్త సినిమాకు సంతకం చేశారట! ‘దిక్కులు చూడకు రామయ్యా’ ఫేమ్ త్రికోటి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘శమంతక మణి’, ‘వీరభోగ వసంతరాయులు’ వంటి మల్టీస్టారర్స్ చేస్తున్న సుధీర్‌బాబు, ‘భలే మంచి రోజు’ తర్వాత సోలో హీరోగా నటించనున్న చిత్రమిది..