శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఈకో'. ఇందులో విద్య ప్రదీప్, పూజ జవేరి కథానాయికలుగా నటించారు. ఆశీష్ విద్యార్థి, కాళీ వెంకట్, శ్రీనాథ్, కుంకీ అశ్విన్, ఢిల్లీ గణేష్, ప్రవీణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీవిష్ణు విజన్స్ పతాకంపై డాక్టర్ రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ గణేష్ దర్శకత్వం వహించారు. గోపీనాథ్ చాయాగ్రహణం, నరేన్ బాల కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రేమ, హారర్ర్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.
(ఇది చదవండి: BRO Trailer: కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్.. డైలాగులే మైనస్!)
అసలు కథేంటంటే..
మంచి సంస్థలో ఉద్యోగం చేసే ఒక యువకుడిని ఆ కంపెనీ చైర్మన్ కూతురు గాఢంగా ప్రేమిస్తుంది. అతను కూడా ఆమె ప్రేమను ఇష్టపడతాడు. అలాంటి సమయంలో ఆ యువకుడు తల్లి ఆమె సొంత ఊరికి కొడుకును తీసుకెళుతుంది. అక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ యువకుడు తల్లి కోరిక మేరకు మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. మొదట్లో భార్యపై అయిష్టత వ్యక్తం చేసిన ఆ తర్వాత స్నేహితుల సలహా మేరకు ఆమెతో కాపురం చేస్తాడు.
అలా భార్యాభర్తల సంసార జీవితం అన్యోన్యంగా సాగుతున్న సమయంలో ఆ ఇంట్లో కొన్ని అతీంద్రియ శక్తులు అతని భార్యని భయబ్రాంతులకు గురిచేస్తాయి. చివరికి ఆమె ప్రాణాలు తీసుకునే పరిస్థితి నెలకొంటుంది. కొన్ని రోజుల తర్వాత తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాడు. అయితే అతీంద్ర శక్తులు అతన్ని కలవరపరుస్తుంటాయి. దీంతో అతను పరిశోధకుడు ఆర్మలాజిస్ట్‌ను కలుస్తాడు. ఆయన పరిశోధనలో ఏం గ్రహించాడు అసలు ఈ సంఘటనలన్నింటికీ కారణం ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
(ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment