బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో టాలీవుడ్ సినీతారలు అలర్ట్ అయ్యారు. తాను అలాంటి పార్టీకి వెళ్లలేదంటూ ఇప్పటికే నటి హేమ స్పష్టం చేశారు. మరోవైపు ఆ సినీతారలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పార్టీకి టాలీవుడ్ హీరో, నటుడు శ్రీకాంత్ హాజరైనట్లు వార్తలొచ్చాయి. దీంతో వీటిపై ఆయన స్పందించారు. రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. దయచసి తప్పుడు కథనాలను నమ్మవద్దని అభిమానులకు శ్రీకాంత్ సూచించారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ..'రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మకండి. బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నా. కొన్ని ఛానెల్స్‌లో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలొచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో నాలా ఉండంటంతోనే అలా రాశారేమో. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. అతన్ని చూసి నేను కూడా షాకయ్యా. అచ్చం నాలా ఉన్నాడనిపించింది. నా ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా. దయచేసి అసత్య కథనాలు ఎవరు నమ్మొద్దు' అని అన్నారు.
అంతే కాకుండా తాను ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని.. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు.. నాలాగా ఉన్నాడనే పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నా.. నేను ఇంట్లోనే ఉన్నా.. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment