మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే కాపుల సంక్షేమం సాధ్యమని పెన్నేరు శ్రీకాంత్ చెప్పారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామజోగయ్య విమర్శించడాన్ని నిరసిస్తూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ జంక్షన్ సమీపంలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తాను రెండున్నరేళ్లుగా ఆ పదవిలో ఉన్నానని.. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను హరిరామజోగయ్య ఏనాడు సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా కాపులకు ఏమీ చేయడం లేదని విమర్శించడంలో అర్థం లేదన్నారు. కాపు కులానికి చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం సాయం చేయాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషును కోరిన వెంటనే స్పందించి ఆర్థి క సాయం అందించారని తెలిపారు.
సీఎంపై పవన్‌కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. జనసేన పార్టీకి మేనిఫెస్టో లేదన్నారు. కాపుల సేవలను టీడీపీ వినియోగించుకుని అధికారంలోకి వచ్చాక వారిని కరివేపాకులా పక్కన పెట్టేసిందని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాల్లో 99 శాతం అమలు చేశారని, ఈ అంశంపై తాను టీడీపీ నేతలతో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment