
సాధారణంగా హీరో లేదా హీరోయిన్‌కి వారసులు దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువగా వచ్చేవారు కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా తల్లితండ్రుల వారసత్వాన్ని టాలీవుడ్‌లో కొనసాగిస్తున్నారు. ఈమె తల్లిదండ్రులు కూడా ప్రముఖ హీరోహీరయినే. కాకపోతే ఈమె నటి అవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్. కానీ చూస్తుంటే మాత్రం హీరోయిన్లని మించిపోయేంత అందంగా కనిపిస్తుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో!)
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మేధ. ఈమె ప్రముఖ హీరో శ్రీకాంత్ కూతురు. 90ల్లో 'పెళ్లి సందడి' లాంటి సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్.. ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అదృష్టం కలిసిరాలేదు. చిన్న కొడుకు రోహన్ ఇంకా చదువుకుంటున్నాడు. అయితే కూతురు మేధ.. రీసెంట్‌గానే చదువు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట శ్రీకాంత్ కూతురు మేధ.. కెమెరా కంటికి చిక్కింది. పింక్ కలర్ చీరలో అందంగా మెరిసిపోతున్న ఈమెని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హీరోయిన్లని మించిపోయేలా ఉన్న ఈమె.. నటి అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు.
(ఇదీ చదవండి: పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్)
Comments
Please login to add a commentAdd a comment