
ఇష్టమైన వారితో కలసి మనం దిగిన ఫొటోలను ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తుంటాం. మన జ్ఞాపకాలు, మనం చేసిన చిలిపి పనులను ప్రపంచానికి తెలియజేయాలనే ఆనందంతో ఇలా పెడుతుంటారు. ఇలాగే ఓ తల్లి కూడా తన కొడుకు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టింది.
అందులో వింతేముంది సాధారణమే కదా అనుకుంటున్నారా..? అయితే అదే ఆమె కొంప ముంచింది. ఎందుకంటే ఆ కన్న కొడుకు తల్లిపై కోర్టుకెక్కాడు. తన అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేసిందంటూ కోర్టులో దావా వేశాడు. తన తల్లి ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో తన ఫొటోలు పెడుతోందని ఇటలీకి చెందిన 16 ఏళ్ల బాలుడు గతేడాది డిసెంబర్ 23న కోర్టులో కేసు వేశాడు.
ఈ ఫొటోల వల్ల తన సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయని, దీంతో అమెరికాకు వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు వాపోయాడు. దీంతో ఆ ఫొటోలన్నింటినీ 2018 ఫిబ్రవరి 1లోగా తొలగించాలని.. లేకపోతే దాదాపు రూ.7.8 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుందని రోమ్‌లోని కోర్టు జడ్జి మోనికా వెల్లెట్టి తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment