హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా కంపెనీ భారతీ ఆక్సా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా క్లెయిమ్ సేవలను పొందే వీలు కల్పించింది. కస్టమర్లకు మరింత పాదర్శకతంగా, వేగంగా క్లయిమ్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని కంపెనీ సీఈవో, ఎండీ వికాస్ సేత్ ఒక ప్రకటనలో తెలిపారు.
నామినీ... భారతీ ఆక్సాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే చాలు... క్లెయిమ్ దరఖాస్తు తాలూకు లింక్ వస్తుందని.. సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేసి నేరుగా బ్యాంక్ ఖాతాలో క్లెయిమ్‌ను జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా క్లెయిమ్ సేవలను అందించేందుకు ప్రత్యేకంగా అధికారులుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment