మంచిర్యాల జిల్లా( జన్నారం): కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు నస్పూరి సంతోష్. ఆయన ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రా మానికి చెందిన రైతు నస్పూరి లచ్చన్న, రాజవ్వ దంప తుల కుమారుడు సంతోష్ పదో తరగతి వరకు తపాల పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. బీఈడీ రాయలసీమ యూనివర్సిటీలో పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు.
2023లో రైల్వేలో ఉద్యోగాల ప్రకటన రావడంతో పరీక్షలు రాసి పాయింట్‌మెన్ ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే ఈ ఏడాది గురు కు ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఏకంగా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యో గాలు సాధించారు. వాటిలో చేరకుండా టీజీపీఎస్సీ వేసిన నోటిఫికేషన్‌లో జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని చదివారు. ఈ నెల 27న ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. తనను కష్టపడి చదివించిన అమ్మనాన్నల ఆశీర్వాదంతోనే ఇన్ని ఉద్యోగాలు సాధించానని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న సంతోష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరుతానని వెల్లడించారు.
చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
Comments
Please login to add a commentAdd a comment