నరసరావుపేట: వారు రైతు బిడ్డలు. భూమాతను నమ్ముకున్న అన్నదాతల కష్టాలు తెలిసిన మానవతావాదులు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీలు చేసినా ఉద్యోగం చేయాలనే ఆలోచనలకు స్వస్తి పలికారు. ఉన్న ఊరిలోనే పలువురికి ఉపాధి కలి్పస్తూ సొంతంగా వ్యాపారం చేయాలని సంకలి్పంచారు. ప్యాకింగ్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఇదీ నరసరావుపేట ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం.
ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయప్రస్థానం ∙ స్వయం ఉపాధితో పాటు 40 మందికి బతుకుతెరువు
ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారం విస్తరిస్తున్నామన్న యాజమాన్యం ∙ ఉన్నత చదువులు చదివినా ఉన్న ఊరికి మేలు చేయాలనే సంకల్పం
ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అయినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూడలేదు. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంత అవసరాలపై దృష్టి కేంద్రీకరించారు. అధ్యయనం చేశారు. ఆయిల్, స్పిన్నింగ్, మిల్క్ యూనిట్లు అనేకం ఉండడంతో ఆయా ఉత్పత్తులు ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అట్ట పెట్టెలు తయారీ పరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇదీ నరసరావుపేట పెద్దచెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అధినేత కామిరెడ్డి కృష్ణకిషోర్‌రెడ్డి విజయగాథ.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ రాకతో ఉజ్వల ప్రగతి
పరిశ్రమ ఏర్పాటుచేసిన కొన్ని నెలలకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీసింది. ఓ వైపు కోవిడ్ తో ప్రభుత్వానికి ఆరి్థక కష్టాలు వెంటాడుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో 2015–20 పాలసీ కింద ఏర్పాటుచేసిన పరిశ్రమలకు చెల్లించాల్సిన సబ్సిడీలను విడుదల చేశారు. దీంతో ఆంజనేయ ఇండస్ట్రీస్ కు రూ. 13 లక్షల సబ్సిడీ లభించింది. దీంతోపాటు విద్యుత్ టారిఫ్‌ల మినహాయింపులు, చెల్లించాల్సిన రుణానికి వడ్డీలో సబ్సిడీ మంజూరు చేశారు. ప్రభుత్వ చర్యలతో యజమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
సుమారు 40 మంది ఉద్యోగులు, కూలీలను నియమించుకొని వ్యాపారాన్ని మరింత విస్తరించారు. మూడు షిప్టులుగా పనిచేస్తున్న సిబ్బందికి ఒకొక్కరికి నెలకు రూ.40వేలు నుంచి రూ.15వేలు వరకు జీతాలు చెల్లించి ఉపాధి చూపించారు. జిల్లాలోని పలు వ్యాపారులు, పరిశ్రమలకు కావాల్సిన అట్టపెట్టెలను ఆర్డర్లు తెప్పించుకొని వారికి నచ్చిన రీతిలో తయారుచేసి సకాలంలో అందిస్తూ వ్యాపారుల మన్ననలు పొందుతున్నారు. ఇంతితై వటుడింతై అన్న చందంగా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.3 నుంచి 4కోట్ల టర్నోవర్ చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం రిక్త హస్తం
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రచారాలు చేసిన గత టీడీపీ పాలకులు హామీలను తుంగలో తొక్కారు. ఎటువంటి సబ్సిడీని మంజూరు చేయకపోయినా కృష్ణకిషోర్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కొని సొంత పెట్టుబడితో పరిశ్రమను స్థాపించాడు. సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనుకున్నా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. దీంతో కష్టంగానే వ్యాపారాన్ని నెట్టుకొచ్చారు.
40 మందికి ఉపాధి
నరసరావుపేటకు చెందిన కామిరెడ్డి కృష్ణకిషోర్‌రెడ్డి ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. నరసరావుపేటలోనే ఏదైనా పరిశ్రమ పెట్టాలని భావించారు. ఈ ప్రాంతంలో ఆయిల్, స్పిన్నింగ్ మిల్లులు, మిల్క్ యూనిట్లు, లాంటి సంస్థల ఆవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్యాకింగ్‌కు ఉపయోగించే అట్టపెట్టెల పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. 2015 నుంచి 2020 పరిశ్రమల ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ పాలసీ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన స్నేహితుడు గెల్లి అరుణ్‌రెడ్డిని భాగస్వామిగా చేసుకొని 2019 జనవరిలో పట్టణంలోని పెద్దచెరువు ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లో ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అనే చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేశారు. మెషినరీ కోసం రూ.60లక్షలు, మరో రూ.25లక్షల ఓవర్ డ్రాప్‌్టతో సంస్థను ప్రారంభించారు.
నా ఆశయం నెరవేరింది
మా లాంటి చిన్నతరహ పరిశ్రమలకు ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. ఏ అధికారి వత్తిళ్లు లేవు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాం. ఉన్న పట్టణంలోనే పదిమందికి ఉపాధి కలి్పంచాలనే నా ఆశయానికి ప్రభుత్వ సహకారం తోడైంది. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం.
–కామిరెడ్డి కృష్ణకిషోర్‌రెడ్డి, ఎం.డి. ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీ
ఉన్న ఊరిలో ఉపాధి దొరికింది
ఈ పరిశ్రమ రావడంతో నాకు ఉన్న ఊరిలోనే ఉపాధి లభించింది. ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 15 వేలు జీతం ఇస్తుండడంతో కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా అట్ట పెట్టెలు తయారుచేస్తున్నాను.
–కె.కోటేశ్వరరావు, కూలీ
యూనిట్ పేరు : ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్
ఉత్పత్తి : అట్ట పెట్టెల తయారీ
యజమానులు : కృష్ణకిషోర్‌రెడ్డి, అజయ్ రెడ్డి
పెట్టుబడి : రూ. 85 లక్షలు
టర్నోవర్ : రూ. 3 కోట్లు
ఉపాధి : 40 మంది
కేటగిరి : చిన్నతరహా
ప్రాంతం : నరసరావుపేట
Comments
Please login to add a commentAdd a comment