ఢిల్లీ జల్‌బోర్డు ఆఫీసు ధ్వంసం​ | Delhi Jal Board Office Vandalised By Unidentified Persons | Sakshi
Sakshi News home page

ఢిల్లీ జల్‌బోర్డు ఆఫీసు ధ్వంసం.. ‘ఆప్‌’ ట్వీట్‌

Published Sun, Jun 16 2024 4:08 PM

Delhi Jal Board Office Vandalised By Unidentified Persons

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత పరిస్థితులు  రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం(జూన్‌16) ఛాతర్‌పూర్‌లోని ఢిల్లీ జల్‌బోర్డు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.

ఆఫీసులో సామాగ్రి పగులగొట్టి చిందరవందరగా పడేశారు. అయితే జలమండలి ఆఫీసుపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఆరోపించింది. దాడి చేస్తున్న వారిలో ఒక వ్యక్తి కాషాయ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది.

 ‘బీజేపీ జిందాబాద్‌ అని నినాదాలు చేసుకుంటూ జలమండలి ఆఫీసును ఎలా పగులగొడుతున్నారో చూడండి. ఓ వైపేమో హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు తాగేందుకు నీళ్లివ్వకుండా ఆపుతుంది. మరోవైపు ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారు’అని  ఆప్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో దాడి వీడియోను పోస్టు చేసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement