రోబోలకు అనువైన ‘చర్మం’ | Scientists ready to new skin for the robots | Sakshi
Sakshi News home page

రోబోలకు అనువైన ‘చర్మం’

Published Thu, Oct 19 2017 2:34 AM | Last Updated on Thu, Oct 19 2017 2:34 AM

Scientists ready to new skin for the robots

వాషింగ్టన్‌: మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను రోబోలకు దానికనుగుణంగా ఉండే చర్మాన్ని పరిశోధకులు రూపొందించారు. ఈ చర్మాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ (యూడబ్ల్యూ)కి చెందిన 45 మంది ప్రొఫెసర్లు తయారు చేసినట్లు యూడబ్ల్యూ ప్రొఫెసర్‌ జోనాథన్‌ పోస్నర్‌ తెలిపారు. ఈ చర్మాన్ని తొడిగిన రోబోలు మనుషుల రోజువారీ పనులను తేలికగా, ఆటంకాలు లేకుండా చేసేస్తాయని చెప్పారు. వస్తువుల స్వభావాలను బట్టి ఈ చర్మం రోబోలకు సంకేతాలు అందిస్తుందని, దానికి తగ్గట్లుగా రోబో పనిచేస్తుందని పోస్నర్‌ తెలిపారు.

ఈ చర్మం అక్టోబర్‌ నెలాఖరు నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ఇంకా తాము పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రత, అత్యంత చల్లదనమైన ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ఈ చర్మాన్ని రూపొందించినట్లు పోస్నర్‌ వివరించారు. స్విమ్మింగ్‌ గగూల్స్‌ తయారీలో ఉపయోగించే సిలికాన్‌ రబ్బర్‌ను ఉపయోగించి ఈ చర్మాన్ని తయారుచేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement