
'మర' మనసులు కలిసిన వేళ...
మర మనిషి, మర మగువ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేడుకలో తెలుపు రంగు పెళ్లి గౌను వేసుకున్న వధువు ఫ్రోయిస్‌ను వరుడు యుకిరిన్ ముద్దాడాడు. 100 మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో వెడ్డింగ్ కేకును కట్‌చేశారు. శనివారం జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ఈ వివాహ వేడుకకు అయోమాకే రెస్టారెంట్ వేదికగా నిలిచింది. రోబోటిక్ బ్యాండ్ ఆధ్వర్యంలో జరిగిన డాన్సింగ్, మ్యూజిక్ కార్యక్రమాల్లో అతిథులు మునిగిపోయారు. పెళ్లి కోసం నవవధూవరుల ఫొటోలతో ఆహ్వానపత్రికనూ అచ్చేశారు. మేవాదికి సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా ఇలా రెండు రోబోలకు పెళ్లి చేసి ఔరా అనిపించింది.