న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లాపై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని అందుకే విడాకుల మంజూరు కుదరదని తేల్చి చెప్పింది.
‘ఒమర్ అబ్దుల్లా పిటిషన్‌లో క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. వాటికి పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్స్ లేవు. అందుకే ఈ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నాం’అనిజస్టిస్ సంజీవ్ సచ్‌దేవ,జస్టిస్ వికాస్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment