kashmir former chief minister
-
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లాపై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని అందుకే విడాకుల మంజూరు కుదరదని తేల్చి చెప్పింది. ‘ఒమర్ అబ్దుల్లా పిటిషన్లో క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. వాటికి పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ లేవు. అందుకే ఈ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నాం’అనిజస్టిస్ సంజీవ్ సచ్దేవ,జస్టిస్ వికాస్ మహాజన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు కావడం విశేషం. ఇదీచదవండి..నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు -
ఫరూక్ ఇంట్లో చొరబడ్డ ఆగంతకుడు
జమ్మూ: కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నివాసంలోకి ఓ యువకుడు కారుతో దూసుకొచ్చి కలకలం సృష్టించాడు. గేటు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించిన అతను ఇంట్లోకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డాడు. చివరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భదత్రా దళాలు అతడిని కాల్చి చంపాయి. శనివారం జమ్మూ శివారులోని భటిందీలో ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ ఎంపీ అయిన ఫరూక్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లి, తిరిగొస్తున్న సమయంలో ఆయన ఇంటిపై ఈ దాడి జరిగింది. ఫరూక్‌తో పాటు ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కలిగిన ప్రముఖుల ఇంట్లోకి అనామకుడు చొరబడటం తీవ్ర భద్రతా ఉల్లంఘనను తేటతెల్లం చేస్తోంది. కాగా, చొరబాటుదారుడిని పాతికేళ్ల సయీద్ మురాద్ షాగా గుర్తించారు. హెచ్చరించినా దూసుకెళ్లాడు.. భద్రతా సిబ్బంది హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ వేగంగా దూసుకొచ్చిన మురాద్.. ఇంటి ముందటి గేటును బద్దలుకొట్టి లోనికి చొరబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాంపౌండ్ లోపల అడ్డందిడ్డంగా వాహనం నడుపుతూ లాన్లో కారు దిగాడు. మురాద్‌ను నిలువరించే క్రమంలో ఒక పోలీస్ గాయపడ్డాడు. లోనికి వెళ్లిన మురాద్ గాజు టేబుళ్లు, గోడలకు వేలాడుతున్న చిత్రపటాలను ధ్వంసం చేశాడు. తర్వాత బెడ్రూంకు వెళ్లే మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించగా సీఆర్పీఫ్ జవాన్లు అతడిని హతమార్చారు. కేసు నమోదుచేసి అతని తండ్రి జాడను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫరూక్ నివాసానికి పటిష్ట భద్రత ఉన్నా మురాద్లోనికి ఎలా ప్రవేశించాడన్నదానిపై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ పరిణామంపై ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ..ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రంలో నెలకొన్న భద్రతా పరిస్థితిని ఇది తేటతెల్లం చేస్తోందని అన్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లిన మురాద్.. ఫరూక్ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడో అర్థంకావడం లేదని అతని బంధువులు చెప్పారు. మురాద్ వెంట ఎలాంటి ఆయుధాలు లేవని, అతడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కశ్మీర్‌పై విషం చిమ్మిన మాజీ ముఖ్యమంత్రి
కేంద్ర మాజీమంత్రి, జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్ విషయంలో విషం చిమ్మారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏమైనా భారత్ 'బాబుగాడి సొమ్మా' అనడమే కాక, నరేంద్రమోదీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సవాలు చేశారు. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించి కూడా ఫక్తు పాకిస్థానీ ఉగ్రవాది తరహాలో వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కూడా స్టేక్‌హోల్డర్లలో ఒకటని, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఆమోదించిందని అన్నారు. దీనిపై ఒక ఒప్పందం కూడా ఉందని.. దాని ప్రకారం పీఓకే అనేది భారతదేశంలో భాగమని చెబుతూనే.. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పాకిస్థాన్‌తో చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు తొలగాలంటే అదొక్కటే మార్గమన్నారు. పాకిస్థాన్ నుంచి పీఓకేను లాక్కునే దమ్ము భారత ప్రభుత్వానికి లేదని, అలాగే భారతదేశం నుంచి కశ్మీర్‌ను లాక్కునే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. వీరిద్దరి మధ్య అమాయకులైన కశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి బ్యాంకుకు వెళ్లి డబ్బు మార్చుకున్న అంశంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మంచి కొడుకు ఎవరైనా తల్లి కష్టపడకూడదని అన్నీ త్యాగం చేస్తాడని.. తాను తీసుకున్న నిర్ణయం (పెద్దనోట్ల రద్దు) కారణంగా కలిగిన అసౌకర్యానికి ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకోనివాళ్లకు కూతురి పెళ్లి కష్టాలు ఎలా తెలుస్తాయని, రూ. 2.50 లక్షలతో పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా సాధ్యమని పరోక్షంగా కూడా మోదీని విమర్శించారు.