ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులను భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) అనర్హులుగా ప్రకటించింది.
ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల జాబితాను బహిరంగపరిచింది. అనర్హతకు గురయిన ఈ 73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు. రాయ్‌పూర్ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిందని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్ బాండే తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 19న ఒక స్థానానికి, ఏప్రిల్ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment