టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు  | AP High Court Rejected TDP MLC Deepak Reddy Petition | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు 

Published Thu, Mar 18 2021 8:19 AM | Last Updated on Thu, Mar 18 2021 12:59 PM

AP High Court Rejected TDP MLC Deepak Reddy Petition - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరగనున్న తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీపక్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఈ దశలో దీపక్‌రెడ్డి కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులివ్వడం సాధ్యం కాదంది. దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్‌ దాఖలు చేసేనాటికి హైదరాబాద్‌లోని రాయదుర్గం మునిసిపాలిటీలో ఓటరని, నిబంధనల ప్రకారం ఆయన ఆ మునిసిపాలిటీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడు అవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీపక్‌రెడ్డి తన ఓటును రాయదుర్గం నుంచి తాడిపత్రికి మార్చుకున్నా.. తాడిపత్రి మునిసిపాలిటీ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు కాజాలరని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి:
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు   
అక్రమాల పుట్ట ‘అమరావతి’

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement