MLC Deepak Reddy
-
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరగనున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీపక్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ దశలో దీపక్‌రెడ్డి కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులివ్వడం సాధ్యం కాదంది. దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసేనాటికి హైదరాబాద్‌లోని రాయదుర్గం మునిసిపాలిటీలో ఓటరని, నిబంధనల ప్రకారం ఆయన ఆ మునిసిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడు అవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీపక్‌రెడ్డి తన ఓటును రాయదుర్గం నుంచి తాడిపత్రికి మార్చుకున్నా.. తాడిపత్రి మునిసిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడు కాజాలరని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
కాలువ అక్రమాల చిట్టా నా వద్ద ఉంది
-
ఒకే ఒరలో మూడు కత్తులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయదుర్గం టీడీపీలో అసమ్మతిపోరు తారస్థాయికి చేరింది. మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మధ్య నెలకొన్న వర్గపోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ‘నున్వా–నేనా’ అంటూ పరస్పరం కత్తులు దూస్తున్నారు. ఓ వైపు మెట్టు.. మరోవైపు దీపక్ కాలవ కంట్లో నలుసులా మారారు. దీపక్‌రెడ్డి అసలు టీడీపీ వ్యక్తే కాదు అని మంత్రి కాలవ.. తాను లేకపోతే ఎమ్మెల్యేగా కాలవ గెలిచేవాడే కాదని దీపక్‌రెడ్డి దూషణలకు దిగుతున్నారు. వీరివద్దరి వైఖరితో ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి తిరిగి తెరపైకి వచ్చి కాలవకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో ‘దుర్గం’ టీడీపీలో పార్టీ కేడర్ మూడు ముక్కలైంది. అనూహ్యంగా దుర్గంపై కాలవ జెండా రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రి కాలవ శ్రీనివాసులు స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గానికి చెందిన కాలవ 1999లో ఎంపీగా గెలుపొందారు. తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. దీంతో గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. చీఫ్ విప్‌గా కొనసాగి ఆపై మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ‘దుర్గం’ టీడీపీకి మెట్టు గోవిందరెడ్డి నాయకుడిగా ఉండేవారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత టీడీపీ బలహీనపడింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు రాజీనామాతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పటి నుండి ‘దుర్గం’ టీడీపీ మెట్టు, దీపక్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయింది. 2014 ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇద్దరికీ కాకుండా కాలవ శ్రీనివాసులకు టీడీపీ అధిష్టానం టిక్కెట్టు కేటాయించింది. కాలవ విజయం సాధించారు. మెట్టు, దీపక్ వర్గాలను పక్కనపెట్టి మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి పూర్తి కొత్త కావడంతో మెట్టు, దీపక్‌రెడ్డితో సంబంధం లేకుండా తనకంటూ ఓ వర్గం ఏర్పరుచుకోవాలని భావించారు. టీడీపీలో ఇక వర్గాలు లేవని, కాలవ వర్గం ఒకటే ఉంటుందని, ఎవ్వరి వద్దకు వెళ్లొద్దనే మెసేజ్‌ను కేడర్‌లోకి పంపారు. అయితే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీపక్, మెట్టు సహకారంతో గెలిచిన వాళ్లు... వారిని వదులుకునేందుకు అయిష్టత చూపారు. కాలవకు వద్దకూ వెళుతూ పాత నేతలను కూడా కలుస్తూ వచ్చారు. ఇది కాలవకు నచ్చలేదు. దీపక్‌రెడ్డి వద్దకు వెళ్లే నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. డీ. హీరేహాల్ ఎంపీపీ పుష్పావతి, ఉస్మాన్, రంగప్పతో పాటు పలువురు నేతలు కాలవ వైఖరిని విభేదించి దీపక్ వెంటే నడుస్తూ వచ్చారు. దీపక్‌పై అవినీతి ఆరోపణలు ఎంతగా ప్రయత్నించినా దీపక్‌రెడ్డి అనుచరులు తనవైపు రాకపోవడంతో.. కాలవ శ్రీనివాసులు పథకం ప్రకారం ముందుకు సాగారు. దీపక్‌రెడ్డి అవినీతి పరుడని అంతర్గతంగా పార్టీ శ్రేణులకు చెబుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీపక్‌రెడ్డిపై బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, దాడి చేశారని సెక్షన్ 506, 447, 341 కింద మారణాయుధాలు ఉన్నాయని సెక్షన్ 148 కింద మాదాపూర్, హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కాలవ వాదనలకు బలం చేకూరింది. దీంతో దీపక్, కాలవను లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, కాలవ అవినీతిపై బహిరంగంగా మాట్లాడుతూ వచ్చారు. గుమ్మఘట్ట జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు కాలవ వర్గంలో చేరారు. దీంతో దీపక్, మెట్టు ఏకమయ్యారు. పైకి దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరి లక్ష్యం ‘కాలవ’ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా తమ వర్గాన్ని బలపరుచుకున్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసినా వ్యతిరేకవర్గాన్ని కాలవ తనవైపు తిప్పుకోలేకపోయారు. పార్టీ నిర్వహించిన సర్వేలు కూడా టీడీపీ ఓటమి ఖాయమని వచ్చింది. ఈ పరిస్థితుల్లో దుర్గం నుండి బరిలోకి దిగితే దీపక్, మెట్టు పూర్తిగా సహకరించరని, ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. ఏకమైన దీపక్, మెట్టు కాలవ చర్యలను గమనించిన దీపక్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు స్థానికసంస్థల ఎన్నికల్లో ఎవరు పార్టీ కోసం పనిచేశారో..? ఎవరి అండతో గెలిచావో గుర్తుంచుకోవాలని మంత్రికి సూచించారు. వైఖరి మారకుంటే కాలవ చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు వచ్చే ఎన్నికల్లో కాలవకు టిక్కెట్టు దక్కకుండా చేయాలని దీపక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలవకు కాకుండా మెట్టు, దీపక్రెడ్డిలో ఎవరికి వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని అంతర్గతంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇది కాలవకు పూర్తిగా మింగుడుపడటం లేదు. నాలుగేళ్లలో కాలవకు భారీగా లబ్ధి కాలవ శ్రీనివాసులు నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా లబ్ధిపొందారు. నీరు–చెట్టు, హైవే పనులు, హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ, ఇతర అభివృద్ధి పనుల్లో బాగా లబ్ధిపొందారు. తాజాగా బీటీపీ పనులు కూడా దక్కాయి. ఈ ఒక్క పనిలోనే రూ. 50 కోట్ల దాకా కాలవకు అందుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రూ.దాదాపు వందకోట్లు కాలవ ఖాతాలో జమ అవుతుందని ఆయన వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాలవ గుట్టు విప్పుతా అని దీపక్ చేసిన ఆరోపణల వెనుక ఈ అవినీతి తతంగమే ఉంటుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పార్టీని మూడు వర్గాలతో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారిందనేది పరిశీలకు అభిప్రాయం. గుంతకల్లు వైపు చూసినా.. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం టికెట్‌ను తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఇప్పించుకోవాలనే యోచనలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు మెట్టు గోవిందరెడ్డి వర్గం కూడా సహకరించని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గం కాకుండా గుంతకల్లు టిక్కెట్టు దక్కించుకోవాలని పార్టీ పెద్దల ద్వారా మంత్రి కాలవ లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జితేంద్రగౌడ్ కాకుండా మాజీ ఎమ్మెల్యే మధూసూదన్గుప్తాకు టిక్కెట్టు ఇప్పించాలని జేసీ ప్రయత్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలిసింది. దీంతో తిరిగి ఎంపీగా వెళ్లాలనే యోచన కూడా చేశారు. అదీ కుదరకపోవడంతో తిరిగి ‘దుర్గం’ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే అసమ్మతిని అణగదొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలపై ఎక్కడా దీపక్‌రెడ్డి ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. -
కాలవా.. నీకిదే చివరి హెచ్చరిక!
‘‘బళ్లారికి వచ్చి నా వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా..? దేవుడి గుడిలో ప్రమాణం చేద్దామా..’’ అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపిస్తే నీవు కిమ్మనలేదు. అంటే పార్టీ సిద్ధాంతాలు, ప్రజలను పట్టించుకోకుండా కుమ్మక్కు రాజకీయాలు చేశావు. రాయదుర్గం: ‘‘నీవు రాజీనామా చేసి రా. నీపై బీసీ అభ్యర్థినే బరిలో దింపుతా, మా సహకారం లేకుండా గెలిచావనుకో.. నీవు గ్రేట్. నేను రాయదుర్గం వదిలి వెళ్లిపోతా. లేకపోతే నువ్వ వెళ్లిపోతావా. అందుకు సిద్ధమైతే.. రా తేల్చుకుందాం.’’ అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రి కాలవకు సవాల్ విసిరారు. ‘‘నన్నూ, నా అనుచర వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నావు. మీలాంటి వారికి నేను భయపడే రకం కాదు.. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ మంత్రిని హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన స్థానిక చేయూత చారిటబుల్ ట్రస్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ అధిష్టానం కాలవకు టికెట్ ఇచ్చినా.. ఎలాంటి స్వార్థం లేకుండా తాము పార్టీ కోసం పనిచేసి, ఆయన్ను గెలిపించామన్నారు. ఇప్పుడేమో ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని దగ్గరకు తీసుకుని, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను ఇబ్బందిపెడుతున్నారన్నారు. దీపక్ రెడ్డి కనబడరాదు, ఫ్లెక్సీలు కట్టరాదు, ఆయన్ను మరిపించాలని మంత్రి కాలవ ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో కుట్ర పన్నాడన్నారు. తాను టీడీపీ వ్యక్తిని కాదనేలా వ్యవహరిస్తున్నాడన్నారు. అయినా ప్రజల్లో దీపక్‌రెడ్డిని మరిపించడం మీ తాత తరం కూడా కాదన్నారు. ‘‘నేను టీడీపీ మనిషిని కాను అని చెప్పించగలవా? అలా చెప్పిస్తే నేను రాజీనామా చేసి, రాయదుర్గం వీడిపోతా. చెప్పించకపోతే నీవు రాజీనామా చేసి పోతావా? అంటూ కాలవకు సవాల్ విసిరారు. నీముఖం మీదే చెప్పింది మరిచావా..? ఎన్నికల ప్రచారంలో ఓటు అడగడానికి వెళితే.. దీపక్ రెడ్డి ముఖం చూసి ఓటేస్తామని ఆనాడు కార్యకర్తలు నీ ముఖం మీదే చెప్పడాన్ని మరచిపోయావా అని కాలవను ప్రశ్నించారు. తన వెంట తిరిగే స్టోర్ డీలర్‌ను తొలగించడం, 6ఏ కేసు బనాయించడం, పార్టీ సిద్ధాంతాలు వీడి డి.హీరేహాళ్ మండల ఎంపీపీని పదవి నుంచి దిగిపో అంటావా? అని దుయ్యబట్టారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ తిరిగి బలహీన పడుతోందనీ, 30 శాతం మంది కార్యకర్తలు మంత్రి పద్ధతి నచ్చక వైఎస్సార్సీపీలోకి వెళ్లాలని సిద్ధమైనా.. వారిని నివారించానన్నారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డిని, ఆయన అనుచరులను పక్కనపెట్టడం తగదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీనైన తనకు సమాచారం ఇవ్వవద్దని అధికారులకు చెబుతూ చిల్లర రాజకీయాలు చేయడం పద్ధతి కాదని కాలవకు సూచించారు. ఇప్పటికైనా మంత్రి తన విధానాలు మార్చుకోవాలి, లేకపోతే అసలు కథ ప్రారంభం అవుతుందన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని...తాను చిట్టా విప్పితే తట్టుకోలేవని కాలవను హెచ్చరించారు. -
అవినీతికి కేరాఫ్..ఏపీ అధికారులు : దీపక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: ఏపీ అధికారులు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సిబ్బంది 5 నుంచి 50 శాతం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్‌రెడ్డి టీడీపీ నుంచి సస్పైండ్ అయిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. 'అవినీతిని నియంత్రించాలి. లేకపోతే అవినీతికి చట్టబద్ధత కల్పించాలి. ప్రజలను సోమరులుగా మారుస్తున్న ఉచిత సబ్సిడీ పథకాలు ఎత్తివేయాలి' అని చెప్పుకొచ్చారు. చాలామంది ప్రభుత్వ అధికారులు సమస్యల పరిష్కారం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, జన్మభూమి కమిటీలపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. 'ఇప్పటికీ తాగునీరు అందుబాటులోలేని గ్రామాలను చూసి సిగ్గుపడాలి. బ్రిటీష్ సంస్రృతి నుంచి మనం బయటపడాలి.. కలెక్టర్లకు అన్ని బాధ్యతలు అప్పగించటం సరికాదు' అని దీపక్‌రెడ్డి చెప్పుకొచ్చారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. -
కక్షకట్టి.. ఫోర్జరీ చేసి..
-
హైకోర్టు నుంచి పిటిషన్ ఫైళ్లు మాయం!
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, శైలేశ్ సక్సేనాలపై కేసు నమోదు హైదరాబాద్: హైకోర్ట్‌లో రిట్ పిటిషన్లకు సంబం ధించిన ఫైళ్లు మాయమైన ఘటనలో ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది శైలేశ్ సక్సేనా తదితరులపై కేసు నమోదైంది. ఫైళ్ళు మాయం ఘటనపై రిజిస్ట్రార్(జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శైలజ అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చారు. ఈ కేసునూ సీసీఎస్‌కు బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేంద ర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గుడిమల్కాపూర్, భోజగుట్ట ప్రాంతాల్లో భూమిని అయోధ్య నగర్ మూచ్యువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం 2008లో జీవో 455 జారీ చేసింది. ఈ భూమిపై కన్నేసిన దీపక్‌రెడ్డి, సక్సేనా భూయజమాని జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ వారసులంటూ ఇక్బాల్ ఇస్లాంఖాన్, నజీము ద్దీన్ ఇస్లాంఖాన్, హబీబ్ ఇస్లాంఖాన్, ఇఫ్తేకర్ ఇస్లాం ఖాన్, షకీల్ ఇస్లాంఖాన్ పేర్లతో కొందరు బోగస్ వ్యక్తుల్ని సృష్టించి భూ ఆక్రమణల నిరోధక న్యాయ స్థానంలో పిటిషన్ వేయించారు. ఆపై షకీల్ తమకు భూమిని విక్రయించాడని, అయోధ్య సొసైటీకి ప్రభుత్వం చేసిన కేటాయింపులను రద్దు చేయాలని జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్‌రెడ్డి, శైలజ అనే మహిళ 2014లో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కొన్ని పిటిషన్లపైనే విచారణ సాగింది. విచారణ జర పని దీపక్‌రెడ్డి, శైలేశ్, శైలజ పిటిషన్లు మాయమ య్యాయి. సీసీఎస్ పోలీసులు ఇటీవల భూ ఆక్రమణ ఆరో పణలపై దీపక్‌రెడ్డి, సక్సేనా తదితరుల్ని అరెస్టు చేశారు. దీంతో అయోధ్య నగర్ సొసైటీ ప్రతినిధులు వాస్తవాలను తమ న్యాయవాది ద్వారా హైకోర్టు ముందుంచారు. కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రీ జారీ చేసిన నోటీసులు అందించడానికి కోర్టు ఉద్యోగులు వెళ్లగా పిటిషనర్ల పేరిట ఉన్న చిరునామాలు నకిలీ వని తేలింది. ఈ విషయాన్ని న్యాయమూర్తికి రిజిస్ట్రీ వివరించగా షకీల్, ఇక్బాల్ తదితరులకు సంబంధిం చిన 14 పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్ : భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నగరంలో పలుచోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరికొద్దిసేపట్లో దీపక్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. -
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సీసీఎస్ కస్టడీ పూర్తి
జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు కేవలం పెట్టుబడులు పెట్టానంటూ వెల్లడి సాక్షి, హైదరాబాద్: భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డితోపాటు న్యాయవాది శైలేష్ సక్సేన, శ్రీనివాస్‌ల పోలీసు కస్టడీ గడువు గురువారంతో ముగిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు చేయించిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్ అధికారులు నిందితుల్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలో విచారించారు. విచారణ చేస్తున్న సమయంలోనే అక్కడ నుంచి ఏసీపీ కార్యాల యానికి తరలించారు. భూ కబ్జాలు, బోగస్ డాక్యుమెం ట్లు, యజమానుల సృష్టిపై ఇతడిని ప్రశ్నించారు. స్థలా లు ఖరీదు చేస్తున్నామంటూ శైలేష్ చెప్పడంతో తాను కేవలం పెట్టుబడులు పెట్టానని విచారణలో చెప్పినట్టు తెలిసింది. విచారణలో కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులు సేకరించా రు. బోగస్ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి సంగ్రహించారు.. స్టాంపులెలా తయారు చేశారు.. తదితర వివరాలు రాబట్టారు. విచారణలో దీపక్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటూ శైలేష్ చెప్పినట్లు తెలుస్తోంది. జీపీఏలు చేసుకునే సమయంలో ఆయనే స్వయంగా సంతకాలు చేశారని, కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చినప్పుడు అధీనంలోకి తీసుకోవడానికి దీపక్‌రెడ్డి సైతం వచ్చినట్లు తెలిపాడు. ఈ కేసులో నిందితుల్ని మరో ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
పోలీసుల కస్టడీకి దీపక్‌రెడ్డి
హైదరాబాద్: c ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో ఉన్న దీపక్ రెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం తిరిగి కోర్టుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. -
భూ కబ్జా కేసులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్టు
♦ సూత్రధారి న్యాయవాది శైలేష్ సక్సేనా సైతం కటకటాల్లోకి ♦ నిందితుడు శివభూషణం విచారణలో వివరాలు వెలుగులోకి సాక్షి, హైదరాబాద్: ఓ న్యాయవాది... మరో రాజకీయ ‘సంబంధీకుడు’... కొందరు బోగస్ వ్యక్తులు... అంతా కలిసి కుట్రతో చేసిన కబ్జా లు అన్నీ ఇన్నీ కావు. హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను వీరు కైకర్యం చేయడానికి భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనాతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు. గత నెలలో సీసీఎస్ పోలీసులకు చిక్కిన వీరి అనుచరుడు మావూరి శివభూషణం విచారణ లో న్యాయవాది శైలేష్ సక్సేనతో పాటు తెలు గుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి లీలలు వెలుగు లోకి వచ్చాయి. అనంతపురం జిల్లా రాయ దుర్గంకు చెందిన ఈయన ఆ జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయానా అల్లుడ నే విషయం విదితమే. అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురా న్యాయవాది శైలేష్ సక్సేనాతో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైన ప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తా ను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు. ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు అతడి పిల్లల వివాహాలకు అవసరమైన సహాయం చేస్తానంటూ శైలేష్ ఒప్పందం కుదుర్చుకు న్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్ల ఖరీదైన 78 ఎకరాల 2 గుంటల స్థలంపై శైలేష్ కన్నేశాడు. స్థల యజమాని ఇక్బాల్ ఇస్లాంఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశా డు. ఇక్బాల్‌గా నటించేందుకు శివభూషణంను ఒప్పించి, బోగస్ పత్రా ల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలంపై శైలేష్ పిటిషన్ వేశాడు. శివభూషణాన్ని కోర్టులో ఇక్బాల్‌గా చూపాడు. వాయిదాలకు వెళ్లినప్పుడల్లా అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు జి.దీపక్ రెడ్డి ఉండేవారు. దీపక్‌రెడ్డిపై గతంలోనూ కేసులు... వీరి వ్యవహారాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసులో దీపక్‌రెడ్డి, శైలే ష్ సక్సేనా ముందస్తు బెయిల్స్ పొందారు. మిగిలిన కేసుల్లో ఒకదాంట్లో ఆధారాలు సేక రించిన సీసీఎస్ పోలీసులు మంగళవారం ముగ్గురినీ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ దీపక్రె డ్డిపై మాదాపూర్ ఠాణాలో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్‌పై దాడికి యత్నించిన కేసు సైతం ఉన్నాయి. నకిలీ ఓటర్ ఐడీతో మరో దందా... ఒక్కో వాయిదాకు హాజరైనందుకు శైలేష్ రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. గుడిమల్కాపూర్తోపాటు మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాష్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. శైలేష్, జి.దీపక్‌రెడ్డిలు శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించి, బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’దాన్ని వాడారు. హైదరాబాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా... ఖరీదు చేస్తున్నట్లు జి.దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేష్ సక్సేనా రూ.1,000 శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించిన శైలేష్... దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించాడు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు దీపక్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో డీసీపీ అవినాశ్ మహంతి నేతృత్వంలోని పోలీసుల బృందం.. చాకచక్యంగా మంగళవారం రాత్రి దీపక్‌రెడ్డిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ సహా ఆరేడు ప్రాంతాల్లోని భూములకు తప్పుడు పత్రాలు సృష్టించిన దీపక్‌రెడ్డి కబ్జాచేశారనే ఆరోపణలున్నాయి. ఆయా భూముల అసలు యజమానులు పోలీసులులను ఆశ్రయించడంతో దీపక్ అక్రమాల గుట్టురట్టైంది. ఈ కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు పలు మార్లు నోటీసులు పంపినప్పటికీ దీపక్‌రెడ్డి స్పందించలేదు. ఎట్టకేలకు వ్యూహంపన్నిన పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. బడా ఫ్యామిలీ వారసుడు: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన దిలీప్‌రెడ్డి ఆ జిల్లా టీడీపీ కీలక నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అల్లుడవుతారు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధిని మరో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. -
సీసీఎస్‌లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
-
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు
-
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు
⇒ బంజారాహిల్స్‌లో విలువైన భూమిని కబ్జా చేసే యత్నం ⇒ బోగస్ డాక్యుమెంట్లను సృష్టించిన వైనం ⇒ నకిలీ స్థల యజమానిని తెరపైకి తెచ్చిన నిందితులు ⇒ దీపక్‌రెడ్డితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ⇒ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు ⇒ హైదరాబాద్, అనంతపురంలో అందుబాటులో లేని దీపక్‌రెడ్డి ⇒ మరో రెండు భూకబ్జా కేసుల్లోనూ దీపక్‌రెడ్డి హస్తం! సాక్షి, సిటీబ్యూరో: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో విలువైన భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ కేసును రిజిస్టర్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. భూకబ్జా కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, అనంతపురంలో ఆయన జాడ లభించకపోవడంతో సాధ్యం కాలేదు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న వారిపై మరో రెండు ఇదే తరహా కేసులు ఉండడంతో వాటిలోనూ దీపక్‌రెడ్డి పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి చెప్పారు. ఖరీదైన 3.37 ఎకరాలపై కన్ను బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలానికి సంబంధించి ఈ వివాదం రేగింది. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితోపాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము కొనుగోలు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్‌చంద్ర సక్సేనాలతోపాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ చౌదరి యజమాని అని తేల్చారు. స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించినవారిపై చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆచూకీ దొరకని అన్సారీ బ్రదర్స్ కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ పోలీసులు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో సదరు స్థలానికి యజమానులు ఎంవీఎస్ చౌదరి బ్రదర్స్ అని తేటతెల్లమైంది. దీపక్‌రెడ్డి తదితరులు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లలోని చిరునామాల ఆధారంగా అన్సారీ బ్రదర్స్‌ను పట్టుకోవడానికి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆ చిరునామాల్లో అన్సారీ బ్రదర్స్ ఆచూకీ లభించలేదు. గతంలోనూ అక్కడ అలాంటి వ్యక్తులెవరూ లేరని తేలింది. దీంతో నిందితులు ఆ భూమికి సంబంధించి నకిలీ యజమానిని తెరపైకి తెచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీపక్‌రెడ్డి తదితరులు వినియోగించిన స్టాంప్ పేపర్లు, స్టాంపులు తదితరాలు పాత తేదీలతో ఉండడం గమనార్హం. నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు ఈ కేసులో మిగిలిన వారితోపాటు ఐదో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. బంజారాహిల్స్ లోని సదరు స్థలానికి సంబంధించిన పూర్తి రికార్డులు తీసుకురావాల్సిందిగా ఈ నోటీసుల్లో సీసీఎస్ పోలీసులు కోరనున్నారు. సక్సేనాలపై మరో రెండు కేసులు... సీసీఎస్‌లో నమోదైన కేసులో దీపక్‌రెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సక్సేనా బ్రదర్స్‌పై ఇదే తరహాకు చెందిన మరో రెండు కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో తాము కన్నేసిన ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు వీరు నకిలీ పత్రాలు సృష్టిస్తుంటారు. వీటి ఆధారంగా సివిల్ కేసులు దాఖలు చేసి, భూమిని వివాదంలోకి లాగుతారు. ఇలా వివాదంలో చిక్కుకున్న స్థలం యజమాని ప్రైవేట్ వ్యక్తి అయితే కబ్జాదారులతో రాజీకే మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ స్థలమైతే విషయం పోలీసు స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్తోంది. ఈ రకంగా ఆసిఫ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో రూ.వందల కోట్ల విలువైన భూముల కబ్జాపై నమోదైన కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లోనూ దీపక్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు, అనుమానితుల విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. కాగితాల్లోనే స్థలాల యజమానులు ఈ మూడు కేసులపై దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ముఠా సృష్టించిన పత్రాల్లోని వివరాలను సరిచూడడం ప్రారంభించారు. అందులో స్థలా లు అమ్మినట్లు, కొన్నట్లు రికార్డయిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించా రు. అవన్నీ బోగస్ పేర్లు, చిరునామాలేనని స్పష్టమైంది. ప్రస్తుతం ఆయా చిరునామల్లో ఉంటున్న వారిని ఆరా తీయగా... సదరు పత్రా ల్లో ఉన్న వ్యక్తులు అక్కడ ఉండరని, వారు ఎవ రో కూడా తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఈ పత్రాల సృష్టికర్తలను గుర్తించి, విచారించగా.. ముఠా సూత్రధారి, పాత్రధారులకు సంబంధించి కీలక సమాచారం బయటపడినట్లు తెలిసింది.