
సాక్షి, అనంతపురం: ఏపీ అధికారులు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సిబ్బంది 5 నుంచి 50 శాతం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్‌రెడ్డి టీడీపీ నుంచి సస్పైండ్ అయిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. 'అవినీతిని నియంత్రించాలి. లేకపోతే అవినీతికి చట్టబద్ధత కల్పించాలి. ప్రజలను సోమరులుగా మారుస్తున్న ఉచిత సబ్సిడీ పథకాలు ఎత్తివేయాలి' అని చెప్పుకొచ్చారు.
చాలామంది ప్రభుత్వ అధికారులు సమస్యల పరిష్కారం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, జన్మభూమి కమిటీలపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. 'ఇప్పటికీ తాగునీరు అందుబాటులోలేని గ్రామాలను చూసి సిగ్గుపడాలి. బ్రిటీష్ సంస్రృతి నుంచి మనం బయటపడాలి.. కలెక్టర్లకు అన్ని బాధ్యతలు అప్పగించటం సరికాదు' అని దీపక్‌రెడ్డి చెప్పుకొచ్చారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment