ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సీసీఎస్‌ కస్టడీ పూర్తి | MLC Deepak Reddy completes CBS custody | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సీసీఎస్‌ కస్టడీ పూర్తి

Published Fri, Jun 16 2017 5:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సీసీఎస్‌ కస్టడీ పూర్తి

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సీసీఎస్‌ కస్టడీ పూర్తి

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలింపు
కేవలం పెట్టుబడులు పెట్టానంటూ వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డితోపాటు న్యాయవాది శైలేష్‌ సక్సేన, శ్రీనివాస్‌ల పోలీసు కస్టడీ గడువు గురువారంతో ముగిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు చేయించిన సీసీఎస్‌ పోలీసులు నాంపల్లి కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్‌ అధికారులు నిందితుల్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలో విచారించారు.

విచారణ చేస్తున్న సమయంలోనే అక్కడ నుంచి ఏసీపీ కార్యాల యానికి తరలించారు. భూ కబ్జాలు, బోగస్‌ డాక్యుమెం ట్లు, యజమానుల సృష్టిపై ఇతడిని ప్రశ్నించారు. స్థలా లు ఖరీదు చేస్తున్నామంటూ శైలేష్‌ చెప్పడంతో తాను కేవలం పెట్టుబడులు పెట్టానని విచారణలో చెప్పినట్టు తెలిసింది. విచారణలో కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులు సేకరించా రు. బోగస్‌ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి సంగ్రహించారు.. స్టాంపులెలా తయారు చేశారు.. తదితర వివరాలు రాబట్టారు.

 విచారణలో దీపక్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటూ శైలేష్‌ చెప్పినట్లు తెలుస్తోంది. జీపీఏలు చేసుకునే సమయంలో ఆయనే స్వయంగా సంతకాలు చేశారని, కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చినప్పుడు అధీనంలోకి తీసుకోవడానికి దీపక్‌రెడ్డి సైతం వచ్చినట్లు తెలిపాడు. ఈ కేసులో నిందితుల్ని మరో ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement