ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, శైలేశ్ సక్సేనాలపై కేసు నమోదు
హైదరాబాద్:
హైకోర్ట్‌లో రిట్ పిటిషన్లకు సంబం ధించిన ఫైళ్లు మాయమైన ఘటనలో ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది శైలేశ్ సక్సేనా తదితరులపై కేసు నమోదైంది. ఫైళ్ళు మాయం ఘటనపై రిజిస్ట్రార్(జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శైలజ అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చారు. ఈ కేసునూ సీసీఎస్‌కు బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేంద ర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గుడిమల్కాపూర్, భోజగుట్ట ప్రాంతాల్లో భూమిని అయోధ్య నగర్ మూచ్యువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం 2008లో జీవో 455 జారీ చేసింది. ఈ భూమిపై కన్నేసిన దీపక్‌రెడ్డి, సక్సేనా భూయజమాని జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ వారసులంటూ ఇక్బాల్ ఇస్లాంఖాన్, నజీము ద్దీన్ ఇస్లాంఖాన్, హబీబ్ ఇస్లాంఖాన్, ఇఫ్తేకర్ ఇస్లాం ఖాన్, షకీల్ ఇస్లాంఖాన్ పేర్లతో కొందరు బోగస్ వ్యక్తుల్ని సృష్టించి భూ ఆక్రమణల నిరోధక న్యాయ స్థానంలో పిటిషన్ వేయించారు.
ఆపై షకీల్ తమకు భూమిని విక్రయించాడని, అయోధ్య సొసైటీకి ప్రభుత్వం చేసిన కేటాయింపులను రద్దు చేయాలని జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్‌రెడ్డి, శైలజ అనే మహిళ 2014లో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కొన్ని పిటిషన్లపైనే విచారణ సాగింది. విచారణ జర పని దీపక్‌రెడ్డి, శైలేశ్, శైలజ పిటిషన్లు మాయమ య్యాయి. సీసీఎస్ పోలీసులు ఇటీవల భూ ఆక్రమణ ఆరో పణలపై దీపక్‌రెడ్డి, సక్సేనా తదితరుల్ని అరెస్టు చేశారు. దీంతో అయోధ్య నగర్ సొసైటీ ప్రతినిధులు వాస్తవాలను తమ న్యాయవాది ద్వారా హైకోర్టు ముందుంచారు. కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రీ జారీ చేసిన నోటీసులు అందించడానికి కోర్టు ఉద్యోగులు వెళ్లగా పిటిషనర్ల పేరిట ఉన్న చిరునామాలు నకిలీ వని తేలింది. ఈ విషయాన్ని న్యాయమూర్తికి రిజిస్ట్రీ వివరించగా షకీల్, ఇక్బాల్ తదితరులకు సంబంధిం చిన 14 పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు.
హైకోర్టు నుంచి పిటిషన్ ఫైళ్లు మాయం!
Published Wed, Jul 19 2017 2:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement