సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో రుణం పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) డెరైక్టర్లు టి.వెంకటరామిరెడ్డి, టి.వినాయక రవిరెడ్డిలకు బెయిల్ ఇచ్చేందుకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు (8వ అదనపు ఎంఎస్‌జే) నిరాకరించింది. ఈ మేరకు వీరిద్దరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ శుక్రవారం కొట్టివేశారు. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.