రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా పర్యటనకు వెళ్లారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతి సోమవారం ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి నుంచి పాలస్తీనా చేరుకున్నారు.
ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ప్రణబ్ బృందం.. పాలస్తీనా సరిహద్దు బైటునియా చెక్ పాయింట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఇజ్రాయెల్ వాహానాల నుంచి పాలస్తీనా ఏర్పాటు చేసిన కాన్వాయ్లోకి మారారు. ప్రణబ్కు పాలస్తీనా విద్యా శాఖ మంత్రి సబ్రీ సైదాన్ స్వాగతం పలికారు. ప్రణబ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్కు వెళతారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.